![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1068 లో.....కాంట్రాక్టు కి సంబంధించిన అడ్వాన్స్ రాగానే ఇందు వెళ్లి ముందు ఎంప్లాయిస్ కి శాలరీస్ ఇస్తుంది. అందరికి శాలరీ వచ్చిందా ఇక నుంచి మీకు శాలరీ లేట్ అవ్వదని నందు చెప్తుంది. ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వెళ్తారు. మరొకవైపు ఐశ్వర్య దగ్గరికి రాజేష్ వచ్చి.. ఇప్పుడు డబ్బు ఇస్తావా నిన్ను ఎత్తుకొని వెళ్లాలా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఐశ్వర్య చెయ్ పట్టుకొని లాక్కొని వెళ్తుంటే ఇందు వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. నన్నే కొడుతావా అని రాజేష్ అంటాడు. నా దగ్గర తీసుకున్న అప్పు పది లక్షలు నాకు ఇవ్వట్లేదని రాజేష్ అందరి ముందు చెప్తాడు.
పది లక్షలు అప్పు చెయ్యాల్సిన అవసరమేంటి ఐశ్వర్య అని భ్రమరాంబ అడుగుతుంది. దాంతో ఇందు కోపంగా అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బు నుంచి పది లక్షలు తీసి రాజేష్ కి ఇస్తుంది. ఏం యాక్టింగ్ చేస్తున్నావ్ ఇందు.. నా ముందు డబ్బు ఇవ్వనని చెప్పి.. అందరి ముందు రాగానే నువ్వు మంచి దానివి అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఇచ్చావని ఐశ్వర్య అంటుంది. నోరు ముయ్ ఇంటి పరువు తీసింది కాక మాట్లాడుతున్నావా అని అపర్ణ కోప్పడుతుంది. నా పెంపకం ఈ రోజు సీఈఓ అయింది. నీ పెంపకం ఇలా నిన్ను నట్టింట్లో నిలబెట్టిందని రేఖతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇందుని రేఖ పక్కకి లాక్కొని వెళ్లి.. ఏంటీ డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నావని కోప్పడుతుంది.
శాలరీ ఇవ్వకపోతే ఎలా వర్క్ చేస్తారు ఆంటీ అని ఇందు అమాయకురాలిలా నటిస్తుంది. మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్పి.. ఇదిగోండి మిగతా డబ్బు అని రేఖకి ఇస్తుంది నందు. మరి నువ్వు వేలిముద్ర కదా వెయ్యాల్సింది సంతకం చేసావ్ ఏంటని రేఖ అడుగుతుంది. అయ్యో నేను మర్చిపోయానని ఇందు టెన్షన్ పడుతుంది. నేనే నేర్పించానని రాజు వచ్చి కవర్ చేస్తాడు. ఆ తర్వాత నాకు డబ్బు ఇస్తావని అనుకున్నాను కానీ ఇవ్వలేదని ఇందుతో రాజు డిస్సపాయింట్ గా మాట్లాడతాడు. తరువాయి భాగంలో శృతి రాకుండా ఉండటానికి తన ఇంటి ముందు రౌడీలని పెడుతుంది రేఖ. కాంట్రాక్టు కుదుర్చుకున్న హరి అనే అతను.. శృతి తీసుకొని వచ్చే డిజైన్ కోసం వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |